సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం సమీపంలోని శ్రీ అంతర్వేది లక్ష్మీ నర్సింహ స్వామి వారి తిరునాళ్ళు ఘనంగా ప్రారంభం అయ్యియి. ఈ ఆలయ నిర్మాణానికి పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు రాజులకు ఎంతటి సంబంధం ఉందొ అందరికి తెలిసిందే. దీనిలో భాగంగా అంతర్వేది ఆలయ నిర్మాత, భక్త శిఖామని ‘పల్లవ వంశస్థులు; కీ. శే. శ్రీ కొప్పనాతి కృష్ణమ్మని స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం జరుపుకుంటున్న అగ్ని కుల క్షత్రియ సంఘీభావ మహా గజమాల యాత్ర నిర్వహిస్తారు. దీనిలో భాగంగా కృత్తివెన్ను మండలం లక్ష్మీ పురం గ్రామం నుండి నేడు, బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ముఖ్య అతిధిగా పాల్గొని అంతర్వేది లక్ష్మీ నర్సింహ స్వామి భక్తులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *