సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పర్యదినాలు నేపథ్యంలో నేడు, సోమవారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు తన భక్తుల కుటుంబాలకు భుక్తి కి ఏ లోటు రానివ్వనని శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో అభయం ఇస్తూ దర్శనమిచ్చారు. పెదపుల్లేరు కు చెందిన కదిలింది కృష్ణంరాజు దంపతుల సౌజన్యంతో ఈ అలంకరణ జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. ఆలయ ఆవరణ పందిళ్ళలో లో ప్రతి సాయంత్రం పలు సాంస్కృతిక ,ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
