సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా లోని మహిమానిత స్వయం భువుడు శ్రీ అన్నవరం సత్య దేవుని కల్యాణోత్సవాలు ఈ నెల 7 నుంచి ఉత్సవాలు ప్రారంబాహం అయ్యి 13వ తేదీవరకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8నస్వామివారి కల్యా ణం జరగనుంది. 9న అరుంధతీ నక్షత్ర దర్శనం, రావణ వాహన గ్రామోత్సవం,10న పండిత సదస్యం, పొన్న వాహన సేవ, 11న వనవిహారోత్సవం , రథోత్సవం, 12న చక్రస్నానం ,13న శ్రీపుష్ప యోగ మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. శ్రీ సత్యనారాయణ వ్రతాలూ, ఉత్సవాల్లో పలు ఆధ్యాత్మిక కార్య క్రమాల నిర్వ హణ, కల్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు, అతిథులకు వసతి, తలంబ్రాల వితరణ, ప్రత్యే క కౌంటర్లు ఏర్పాటు, బందోబస్తు, రవాణా, భోజన వసతి, తాగునీరు, పార్కింగ్, తదితర వాటిపై అధికారులు ద్రుష్టి పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *