సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీనివాసా సెంటర్ ఓవర్ బిర్జ్ దిగువున దశాబ్దాలుగా కొలువై ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో దసరావేడుకలు ముగింపుగా శ్రీ కామాక్షి అమ్మవారికి అర్చకుల వేదమంత్రాల మధ్య మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదుగా మహా నైవైద్య ( భారీ కుంభంపై మిఠాయిలు వేసి ) శ్రీ అమ్మవారికి హారతులు ఇచ్చి సమర్పణ నిర్వహించిన పిదప విశేషంగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. శ్రీ కామాక్షి అమ్మవారి దయతో స్థానిక ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకొంటూ గ్రంధి శ్రీనివాస్ నిర్వాహకులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *