సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59 వార్షిక మహోత్సవాలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. నేడు, ఆదివారం ఫిబ్రవరి 5వ తేదీ న శ్రీ అమ్మవారు శ్రీ గజ లక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ అమ్మవారి అలంకారం ను పెద్దపుల్లేరు గ్రామానికి చెందిన సాయి సతీష్ చంద్ర, సునీతా దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు, ఈ రోజు ఉత్సవాలలో ఆఖరి ఆదివారం కావడంతో ఉదయం 7 గంట నుండి భక్తులు విపరీతంగా వచ్చి భారీ క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి అస్సిసులు తీసుకొంటున్నారు. శ్రీ అమ్మవారి ఎదురుగ దేవాలయంలో నేడు, ‘ మహా చండి’ యాగం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు.. నేటి రాత్రి 7 గంటల నుండి ‘ కురుక్షేత్రం’ నాటకం ఆహుతులను విశేషంగా అలరించనుంది. ఈ నెల 10 వ తేదీ న లక్షమంది భక్తులకు అఖండ అన్నసమారాధన తో ఉత్సవాలు ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *