సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు దసరా వేడుకలలో భాగంగా నేడు, బుధవారం శ్రీ గాయత్రీ దేవి అవతారంలో 5 ముఖాలతో, 4వేదాలు పట్టుకొని 10 చేతులు ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. ఆలయ ఆవరణలో ప్రజలకు సుఖ శాంతులు కోరుకొంటూ వేదమంత్రాలతో చండి హోమము నిర్వహించారు. ఆలయ కళా వేదికపై సాయంత్రం 7గంటల నుండి అభినయ నాట్య అకాడమీ వారి కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. ఫై తాజా చిత్రంలో శ్రీ అమ్మవారి శ్రీ గాయత్రీ దేవి అవతారం చూడవచ్చు..
