సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో పలు ప్రవేటు విద్య సంస్థలు వసతులు లేకపోయిన విద్యార్థుల పీజులు భారీగా పెంచడమే కాదు.. విద్యార్థులపై , విద్యార్థినులపై సీసీ కెమెరాల ప్రహసనాలు అమానుష బెదిరింపు ధోరణలు,విద్యార్థుల ఆత్మహత్యలు కూడా బాగా ప్రబలినట్లు ఇటీవల వరుస పరిణామాలు గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య లో మరోసారి మరణ ఘోష వినిపించింది. తాజాగా గుంటూరు జిల్లా రెడ్డిపాలెంశ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న చిలకలూరిపేటకు చెందిన కరణం పద్మ సుధ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే స్కూలులోనే గత మంగళవారం అర్ధ రాత్రి ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం చెబుతున్నారు. సమాచారాన్ని చిలకలూరిపేట లోని తల్లిదండ్రులకు తెలియజేయడంతో హుటాహుటిన వారు శ్రీ చైతన్య క్యాంపస్ వద్దకు నేడు, బుధవారం ఉదయం చేరుకున్నారు. విగత జీవిగా మారిన కుమార్తెను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పద్మసుధ మృతికి కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా యాజమాన్యం ముఖం చాటేస్తుంది. అయితే అక్కడ చదువుతున్న విద్యార్థులు పలువురు పలు విధాలుగా మృతికి సంబంధించి చెబుతున్నారు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు, మీడియాను, పోలీసు వారి సహకారం కోరుతూ స్కూలు వద్ద నే బైఠాయించారు. అయితే కుటుంబ సభ్యులను మభ్య పెట్టేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. కొందరు నేతలు ఈ వ్యవహారంలో తలదూర్చి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తె మరణం ఫై వాస్తవాలు తెలియాలని పోలీసులు కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
