సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో భాగంగా నేడు, శనివారం శ్రీ దుర్గ దేవి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.ఆవుల అనిల్ దంపతుల సోజన్యంతో అలంకారం జరిగింది. దుష్ట శిక్షణ .. శిష్ట రక్షణ మూర్తీభవించిన శ్రీ దుర్గదేవి గా 8 చేతులతో ఆయుధాలు ధరించి పులి వాహనం ఎక్కి భక్తులకు అభయం ఇస్తున్నారు. విశేషంగా భక్తులు హాజరు అయ్యి అమ్మవారిని దర్శించుకొంటున్నారు. నేటి ఉదయం నుండి లక్ష కుంకుమ అర్చనలు తో పాటు అనేక మంది మహిళలు పాల్గొని లలితా సహస్రనామ పారాయణం చేసారు. . నేటి మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ కళా వేదికపై భజన, ఆధ్యాత్మిక ఉపన్యాసాలుతో పాటు నేటి రాత్రి 7గంటల నుండి విజయవాడ నాట్య అంజలి వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసారు. కావున ఈ సాంసృతిక కార్యక్రమాలకు అందరు ఆహ్వానితులే.. .
