సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు వార్షికోత్సవాలులో భాగంగా అష్ట లక్ష్మి దేవి అవతారాలలో భాగంగా నేడు, శుక్రవారం శ్రీ ధాన్య లక్ష్మి దేవి అవతారంలో శ్రీ అమ్మవారు దర్శనమిచ్చారు. యు దుష్యంత్ కుమార్, అరుణ్ కుమారి దంపతుల సౌజన్యం తో ఈ అవతార అలంకరణ ఏర్పాటు చేసారు. నేడు శుక్రవారం కూడా కావడంతో విశేషంగా మహిళా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. నేటి మధ్యాహ్నం 2గంటల నుండి కళావేదికపై ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం 5 గంటలకు వెంకీ మ్యూజికల్ నైట్ మరియు రాత్రి 8 గంటల నుండి ‘రెండు రత్నములు’ నాటకం ప్రదర్శితమౌతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *