సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం పట్టణం జేపీ రోడ్డు , నటరాజు థియేటర్ ఎదురుగ ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాలు ముగింపు సందర్భంగా నేడు, శనివారం మహా అన్నదానం జరిపారు. ప్రత్యేక పూజలు తదుపరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్ని దానలలో అన్నదానం గొప్పదని పెద్దలు చెపుతారని.. శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం అనుబంధ సంస్థ అయిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణ మహోత్సవాలను ఈనెల ఒకటో తేదీ నుండి ఘనంగా నిర్వహించారని అన్నారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవార్లకు చందనాలంకరణ, అష్టోత్తర కలశాభిషేకం, స్వామివారి కళ్యాణం, స్వామి వారికి రథోత్సవం, పుష్పయాగం, చక్రస్నానం, పుష్పోత్సవం, అఖండ అన్న సమారాధన కార్యక్రమాలను నిర్వహించిన ఆలయ పాలకమండలిని, అధికారులను అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.
