సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో ( మన సిగ్మా వెబ్ ఛానెల్ ఆఫీస్ వద్ద) సుమారు 150 ఏళ్ళ క్రితం వెలసిన మహీనిత ‘శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి జాతర మహోత్సవం మహర్నవమి సందర్భముగా నిన్న శుక్రవారం ప్రారంభమయి, నేటి, శనివారం తెల్లవారు జాము వరకు స్వామివారి నగర సంచారంతో ముగిసింది. గత రాత్రి శ్రీ స్వామివారికి మేళతాళాలతో , వీర శైవ త్రిశుల నృచాలతో ,డప్పు వాయిద్యాలతో, ప్రభల కోలాహంతో జాతర నిర్వహించారు. 100 ఏళ్లపైగా సంప్రదాయంగా వస్తున్నా నిప్పుల గుండం.. తమ కోర్కెలు నెరవేరటం కోసం ఇక్కడ ఉపవాసం, నిష్ఠ తో ఉన్న భక్తుల కోసం రాత్రి 11 గంటలకు, ఎర్రటి నిప్పుల గుండం లో భక్తులు ‘అసారభ అసారభ అంటూ నిప్పులనును తొక్కడం హైలైట్ గా నిల్చింది. తదుపరి నంది వాహనం ఎక్కివిద్యుత్తూ దీపాల వెలుగులో కాగడాలతో,మేళతాళాలతో , డప్పు వాయిద్యాలతో స్వామివారు శ్రీ భద్ర కాళీ సమేతంగా ప్రజలకు అస్సిసులు అందజెయ్యడానికి నగర సంచారం చేసి తెల్లవారు జామున దేవాలయం కు తిరిగి రావడం తో జాతర ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *