సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శ్రీ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు పద్మములో కూర్చుని మహా సౌభాగ్యాలు కలుగజేసే తల్లిగా దర్శనమిచ్చారు. సత్తి పద్మావతి కుటుంబ సభ్యులు అలంకరణ ఏర్పాట్లు చేసారు. విశేషంగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. నేటి తో అష్టలక్ష్మి అవత్రాలు అలంకరణ పూర్తీ అయ్యింది. రేపు శుక్రవారం వార్షిక మహోత్సవాలు ముగింపుగా శ్రీ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి వేలాది భక్తులకు అన్నసమారాధన చెయ్యనున్నారు. రేపు ఉదయం 7న్నర కు శ్రీ అమ్మవారికి పంచభక్ష పరమణలతో మిఠాయిలతో మహా కుంభ సైవేద్యం సమర్పించి ఉదయం 8 గంటల నుండి అన్న సమారాధన ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం వరకు నిర్వహిస్తారు.
