సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో భాగంగా నేడు, బుధవారం శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు విశేషంగా శ్రీ మహాలక్ష్మి తల్లి అస్సిసులు పొందుతున్నారు. ఉదయం 9 గంటలకు కుంకుమ అర్చనలతో పాటు వేద పండితులు చండి హోమం ఘనంగా నిర్వహించారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ కళా వేదికపై భజన, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు బుర్రకథ లు నేటి రాత్రి 9గంటల వరకు నిర్వహిస్తారు. దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు. ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *