సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షికోత్సవాలు లో భాగంగా నేడు, గురువారం శ్రీ మహాలక్ష్మి అవతారంలో శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారం ను స్థానిక భక్తులు శ్రీమతి సత్తి పద్మావతి రెడ్డి వారి కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో ఏర్పటు చేసారు. రేపు శుక్రవారం ఉత్సవాలు ముగింపు రోజు కావడంతో.. శ్రీ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిస్తారని ఆలయ సహాయ కమిషనర్ వై భద్రజీ తెలిపారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధర్యంలో ఉదయం 7న్నర గంటలకు అమ్మవారికి మహా ప్రసాద నైవేద్య సమర్పణ మరియు లక్ష మంది భక్తులకు దేవాలయ ఆవరణలో పంచభక్ష్య పరమానాలతో భోజన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు.a
