సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో దసరా వేడుకలలో భాగంగా నేడు, మంగళవారం మహర్నవమి రోజు శ్రీ అమ్మవారు ‘శ్రీ మహిషాసుర మర్ధిని’ అలంకరణలో సింహ వాహనం అధిరోహించి, మహిషాసురుడిని మర్ధిస్తున్న నిలువెత్తు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు మధ్యాహ్నం నుండి ఆలయ కళావేదికపై జరిగే కార్యక్రమంలో సాయంత్రం 4గంటలకు మిమిక్రి, మ్యాజిక్ షో ప్రదర్శన , మరియు సాయంత్రం 7 గంటలకు మోనికా మ్యూజికల్ ఆర్కెస్ట్రా వారి సంగీత విభావరి నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *