సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో నేడు, గురువారం ఉదయం హుండీలు తెరచి లెక్కించారు . గత 28 రోజుల కాలానికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు డబ్బు రూపంలో రూ.51,52,032. ( అక్షరాలా యాభై ఒక్క లక్ష యాభై రెండువేల ముప్పై రెండు రూపాయలు ) లభించగా బంగారం 33 గ్రాములు 240 మిల్లీగ్రాములు, వెండీ 189 గ్రాములు మరియు పలు దేశముల విదేశీ కరెన్సి శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా సమర్పించుకున్నారు. పలువురు దేవాదాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో ఆలయప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తలు ,u మీనాక్షి, శిరీష,పాపోలు ఏడుకొండలు,,కారెంపూడి ఆదిలక్ష్మి,జి రమణ,వై సత్యవతి,బన్ను ప్రసాద్ ,మరియు యూనియన్ బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది ,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
