సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో నేడు, శనివారం హుండీ తెరచి లెక్కించారు 105 రోజులకు కాలానికి హుండీలలో భక్తులు చెల్లించిన కానుకల ద్వారా మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1,02,81,455. అక్షరాలా కోటి రెండు లక్షల ఎనభై ఒక వేయి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు లభించింది. ఇక , బంగారం 215 గ్రాములు 200 మిల్లీగ్రాములు, 360 గ్రాములు వెండీ మరియు పలు దేశముల విదేశీ కరెన్సి శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించు కున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ V హరిసూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిపిన ఈ లెక్కింపులో.. భక్తుల విశేష అద్భుతమైన ఆధరణ వలన భారీ ఆదాయం రావడం పట్ల ఆలయ సిబ్బంది మరియు ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ హర్షం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *