సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాకుళం కు చెందిన భక్తురాలు శ్రీ అమ్మవారి స్వర్ణ వస్త్రానికి 39వేల రూపాయలు విలువైన 4గ్రాముల బంగారాన్ని కానుకగా అందజేశారు. అలాగే శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయం అయినటువంటి అశ్వత్త గణపతి స్వామివారి నవరాత్రులలో భాగంగా శ్రీ దేవి భజన సమాజం గూట్లపాడు వారిచే భజన కార్యక్రమం నిర్వహించినారని, ప్రతి రోజు రాత్రి జరిగే ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తులు హాజరు అవుతున్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
