సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు, ఆదివారం కూడా కావడంతో ఉదయం నుండి రాత్రి వరకు వేలాది భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి శ్రీ అమ్మవారి దర్సనం చేసుకొన్నారు. నేటి సాయంత్రం నుండి ఆలయ ఆవరణలో సెట్టింగ్లు చూడటానికి వేలాది భక్తులు రావడంతో ఇసుకవేస్తే క్రింద పడదు .. అన్నంత రద్దీగా మారింది. నేడు సుమారు 30వేల మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లను చక్కగా పర్యవేక్షించారు. సంక్రాంతి కి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో సహా ( ఫై ఫోటో) పలువురు చిత్ర యూనిటీ సభ్యులు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకొన్నారు.దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ భక్తుల దర్శనాల ఏర్పాట్లను వీఐపీ ల ఆలయ మర్యాదలను పర్యవేక్షిస్తున్నారు.
