సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా స్థానిక భక్తులు, కొప్పనర్తి ప్రభాకర్ రెడ్డి శ్రీవాణి దంపతులు వారింటి ఆడపడుచు గా భావించి మిఠాయిలు,పండ్లు , చీర రవిక, గాజులు పసుపు కుంకుమ లతో భారీగా సారె ను సమర్పించారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందచేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
