సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, సోమవారం సాయంత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరం కి చెందిన హారిక పూజ సామాగ్రి నిర్వాహకులు, ఆర్ ఉదయ సూర్య భాను ప్రకాష్ పద్మ దంపతులు 280 కేజిలతో తయారుచేసిన శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి పంచలోహ విగ్రహం ను 7 లక్షల 40 వేల వ్యయంతో తయారు చేయించి (7,40,000) ఆలయంలో శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారని .. ఆ దంపతుల సమక్షంలో ఆ విగ్రహానికి ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
