సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రవణా మాసం నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని ఇటీవల వివాహ వేడుకలు చేసుకొన్నా నూతన జంటలు, వారి బంధుమితృలు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చి దర్శించుకొని అస్సిసులు తీసుకొంటున్నారు. నేడు, శ్రీ అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ కి చెందిన M మోహన్ బాబు శ్రావణి దంపతులు 8 గ్రాముల బంగారం శ్రీఅమ్మవారికి కానుకగా అందజేశారని వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
