సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, బుధవారం అక్షయ తృతీయ నేపథ్యంలో విశేషంగా భక్తులు బంగారు తల్లి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం తాడేపల్లి గూడెం చెందిన Y H N సతీష్ ఫణి శిరీషా దంపతులు 8 గ్రాములు బంగారం శ్రీ అమ్మవారికి కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి శేషవస్త్రం,ప్రసాదాలు అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *