సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి తాడేపల్లి గూడెం కి చెందిన భక్తులు బి గోపాల కృష్ణ నేడు, ఆదివారం శ్రీ అమ్మవారిని దర్శించుకొని 8 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు వీరికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నాగ భూషణం ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. శ్రీ అమ్మవారి వార్షిక మహోత్సవాలలో శ్రీ అమ్మవారిని దర్శించుకొనేందుకు వేలాది భక్తులు భారీ క్యూ లైన్లలో నిలబడి ఎటువంటి త్రోపులాటలు లేకుండా శ్రీ అమ్మవారిని దర్శించుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *