సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, సోమవారం దర్శించుకున్న చెన్నై వాస్తవ్యులు వేదపండితులు బ్రహ్మశ్రీ. జి. కామశాస్త్రి ఘనపాఠీ, శ్రీమతి భారతి దంపతులు అమ్మవారి బంగారు చీర నిమిత్తం 11.000/- రూపాయలు కానుకగా అందజేశారు. వారికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొడమంచిలి కోప్పేశ్వరరావు గారు అమ్మవారి శేష వస్త్రం తీర్థప్రసాదములు అందజేశారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి కలవపూడికి చెందిన సూర్యకాంతం అనే భక్తురాలు 4 గ్రాముల బంగారం ని కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించినారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ లోకనాధరావు ప్రసాదాలు శేషవస్త్రం అందచేసినారని సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
