సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం ఉదయం 7న్నర సమయానికి శ్రీ అమ్మవారికి ఎదురుగా భారీ ఎత్తున పులిహోర , పంచభక్ష పరమణాలతో మిఠాయిలతో మహా నివేదనను వేదమంత్రోచ్చారణ హారతుల మధ్య స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమర్పించారు. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు నర్సాపురం వైసిపి పార్లమెంట్ ఇంచార్జి గూడూరి ఉమాబాల కూడా పాల్గొన్నారు. తదుపరి భారీ 36 కేజీల లడ్డు వేలంలో 1లక్ష 60 వేల కు స్థానిక గ్రంధి శ్రీనివాస్ యూత్ స్వంతం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దాతలు ఎక్కువ మందిని లోపలకు అనుమతించడంతో, వారికీ శ్రీ అమ్మవారికి నైవేద్య సమర్పణ తదుపరి సంప్రదాయంగా ప్లాసిక్ సంచులలో ఇచ్చే కుంభ ప్రసాదం ఉత్సవ నిర్వాహకులు వెంటనే ఇచ్చి బయటకు పంపక పోవడంతో భక్తులు ఉక్కిరిబిక్కిరి కి గురయ్యారు. మీడియా ప్రతినిధులకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. జిల్లాలో మరెక్కడా జరుగని స్థాయిలో..ఉదయం 8 గంటల నుండి ఆలయ ఆవరణలో ఏర్పటు చేసిన భారీ చలువ పందిళ్ళలో వేలాది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం ప్రారంభమయింది. వేలాదిగా తరలి వస్తున్నా భక్తులతో నేటి మధ్యాహ్నం వన్ టౌన్ పట్టణ రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ మహా నివేదన కార్యక్రమంలో నీరుల్లి కూరగాయ వర్తకసంఘం , మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు , ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ పాల్గొన్నారు. అదనపు పోలీస్ బలగాలతో చక్కగా భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు.
