సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పర్వ దినాలలో కనుమ పండుగ రోజున శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కుటుంబ సపరివార సమేతంగా హాజరు అయ్యి శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలు నిర్వహించి తదుపరి తూకంలో తన బరువు కు సరిపడిన బెల్లం, మిఠాయిలతో పాటు,అమ్మవారికి చీర, గాజులు తో సారె సమర్పించి, అమ్మవారికి మొక్కుబడి ని తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు, దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. .
