సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు నేపథ్యంలో నేడు, ఆదివారం సంక్రాంతి కి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీ అమ్మవారి ని దర్శనం చేసుకొన్నారు. ( ఆమె శ్రీ పంచారామ సోమేశ్వర స్వామిని కూడా దర్శించుకొన్నారు. ఈనేపథ్యంలో ఆమెకు దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ సిబ్బంది శ్రీ అమ్మవారి ఫోటో, శేష వస్త్రం అందజేశారు.( ఫై ఫొటోలో ) శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు కలిదిండి వెంకట దిలీప్ కుమార్ వర్మ దంపతులు శ్రీ అమ్మవారికి 10 గ్రాములు బంగారం కానుకగా సమర్పించారు. ( ఫై ఫొటోలో )ఆలయ అర్చకులు మద్దిరాల రమణ శర్మ వీరికి పూజలు నిర్వహించినారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో వీరికి అందజేశారు.
