సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, బుధవారం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఆకివీడు పూల పండ్లు వ్యాపారస్తుల సంఘం ప్రెసిడెంట్ Sk బాజి ఆధ్వర్యంలో సుమారు 160 కేజీల వివిధ రకముల పూలతో బారి గజమాల సమర్పించారు.గత 24 సంవత్సరాల నుండి శ్రీ అమ్మవారికి వార్షిక మహోత్సవాలలో గజమాల సమర్పిస్తున్నట్లు ప్రెసిడెంట్ మరియు సభ్యులు తెలియచేసినారు…ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటో అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం శ్రీనివాస్ పాపొలు ఏడుకొండలు మరియు ఆకివీడు పూల పండ్లు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *