సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని నేటి ఆదివారం ఉదయం దర్శించుకున్న దూరప్రాంతాలకు చెందిన శ్రీ అమ్మవారికి కానుకగా 38 గ్రాముల బంగారాన్ని కానుకలుగా సమర్పించారు. ఈ బంగారం కానుకలు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానం ఈవో, సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందించారు. శ్రీ గజలక్ష్మి దేవి అవతారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అత్తిలికి చెందిన వానపల్లి గంగరాజు ప్రకాష్, సీతా మహాలక్ష్మి దంపతులు 30 గ్రాములు,( ఫై చిత్రంలో చూడవచ్చు ) కలవపూడికి చెందిన ఏం చిన వెంకటరాజు, సూర్యకాంతం 4 గ్రాములు, పి దుర్గ ప్రసాదరాజు, శ్రీదేవి 4 గ్రాములు బంగారాన్ని విరాళంగా అందించారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వారికీ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. భక్తులు భక్తి భావంతో సమర్పిస్తున్న బంగారముతో అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారు చేస్తామని, త్వరలో స్వర్ణ చీర పూర్తీ అవుతుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.ఈ కార్యక్రమంలో , మాజీ ట్రస్ట్ సభ్యులు కారుమూరి సత్యనారాయణ మూర్తి, కట్టా వెంకటేశ్వరావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
