సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర వేడుకలు పట్టణం లో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ అమ్మవారు గరగల రూపంలో ప్రతి ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకివీడు కి చెందిన శ్రీ అమ్మవారి భక్తులు శ్రీనివాస్ పురుషోత్తం నాగ వెంకట కనకదుర్గా దంపతులు 5 ఇత్తడి గరగలు (32కేజీలు) తో తయారు చేయించి సారె తో సహా అందజేశారు. వీరిచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలు చేయించారని ఆలయ సహాయకమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *