సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శ్రావణ శుక్రవారం నేపథ్యంలో ఎంతో దూరప్రాంతాల నుండి కూడా విశేషంగా భక్తులు రావడంతో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం ఆధ్యాత్మిక శోభ తో కళకళ లాడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు దంపతులు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. వారికీ ఆలయ మర్యాదలతో ప్రధానర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కమిషనర్, యర్రంశెట్టి భద్రాజీ మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు ధర్మకర్తలు ch శేషగిరి, రామాయణం సత్యనారాయణ తాళ్లపూడి భాగ్యలక్ష్మి గోపిశెట్టి విజయలక్ష్మి పాల్గొని మంత్రి కారుమూరి దంపతులకు శ్రీ అమ్మవారి జ్ఞాపిక శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *