సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉండి శాసన సభ్యులు మంతెన రామరాజు ఆలయ మర్యాదలతో దర్శించుకున్నారు. వీరితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు ఉన్నారు. ఈ సందర్భముగా ఎంపీ రఘురామా మాట్లాడుతూ.. గతంలో శ్రీ అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని 4 ఏళ్ళు అయ్యిందని , శ్రీ అమ్మవారికి దూరంగా ఉన్నపటికీ హైదరాబాద్ లో నా నివాసం పూజగదిలో నిత్యం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఫొటో ను పూజిస్తూనే ఉంటానని అన్నారు. చంద్రబాబు అన్ని కేసుల నుండి విముక్తి కావాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు.
