సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం లో దేవి శరన్నవరాత్రులలో ప్రతి రోజు వేలాది భక్తులు హాజరు అవుతున్నారు. ఎంతో దూరప్రాంతాల నుండి కూడా విశేషంగా భక్తులు హాజరు అయ్యి శ్రీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఆమె దర్శనం పొందుతున్నారు. ఈనేపథ్యంలో శ్రీ అమ్మవారిని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు శ్రీ అమ్మవారిని ఆలయ మర్యాదలతో దర్శించు కున్నారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ప్రసాదాలు ఫోటో అందించడం జరిగింది.
