సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, శనివారం తెలంగాణ హైకోర్ట్ జడ్జి, జస్టిస్ జి. అనుపమ చక్రవర్తి దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ , ముత్యాల వెంకట రామారావు పాల్గొన్నారు.
