సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారిని నేడు, బుధవారం (భీమవరం పట్టణానికి చెందిన) సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకొన్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేయించి తదుపరి కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ చేతులమీదుగా శ్రీ అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. నా స్వంత ఊరిలో నా మావుళ్ళమ్మవారి సన్నిధిలో ఈ గౌరవం పొందటం తన అదృష్టంగా త్రివిక్రమ్ పేర్కొన్నారు.
