సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో దసరా వేడుకలు ముగింపు సందర్భముగా నేడు, శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజాధికార్యక్రమములు నిర్వహించారు. అనంతరం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ దేవాలయ ఆవరణంలో వేసిన పందిళ్ళ క్రింద ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, కుమారుడు గ్రంధి రవితేజ్ చేతుల మీదుగా ఉదయం. గం. 10.00 లకు శ్రీ అమ్మవారి అఖండ అన్నసమారాధన ప్రారంభించారు. నేడు శుక్రవారం కూడా కావడంతో ఈ అన్నదాన కార్యక్రమములో వేల మంది భక్తులు అన్నదానమును స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త తోట భాస్కరరావు, జయలక్ష్మీ దంపతులు మరియు గ్రంది చినతాతారావు జననీ పార్వతి దంపతులు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదానము ట్రస్ట్కు రూ.1,01,116/-లు కానుకగా అందచేసారు.ఈ కార్యాక్రమములో సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి, యర్రంశెట్టి భద్రాజీ, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ ,మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం సత్యనారాయణ, ముత్యాల వెంకట రామారావు, సిహెచ్ నాగశేషగిరి, మావూరి సుందరరావు, టి. బాగ్యలక్ష్మి, కె.వెంకటలక్ష్మి, జి.విజయలక్ష్మి, యన్.విజయనాగలక్ష్మి పాల్గొన్నారు.
