సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో దసరా వేడుకలు ముగింపుగా నేడు, సోమవారం ఉదయం శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు మహా ప్రసాద వితరణ చేసారు. అన్న సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ముందుగా శ్రీ అమ్మవారికి మహా నివేదన నిర్వహించారు. అన్ని దానల కెల్లా అన్నదానం గొప్పదని, దైవ కార్యక్రమంలో అన్నదానం చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని అన్నారు. శ్రీ మావుళ్ళమ్మవారి దయతో భీమవరం సుభిక్షంగా ఉందని ఈ దసరా వేడుకలు చక్కగా నిర్వహించారని ఆలయ సిబ్బంది ని అభినందించారు. అన్న సమారాధనలో సుమారు 3000 మంది పైగా భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి,సహాయ కమిషనర్ , బుద్దా మహాలక్ష్మి నగేష్, ఆలయ మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణ మూర్తి, మాజీ ట్రస్ట్ సభ్యులు లంకి శ్రీనివాస్, ముచ్చకర్ల శివ, రామాయణం శ్రీనివాస్, ఆకుల కృష్ణ, కొప్పినిడి శ్రీనివాస్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
