సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శనివారం శ్రీ అమ్మవారి అనుగ్రహం కోసం 140 మంది భక్తులు అర్ధమండల దీక్ష ధరించారు. శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వారికీ అర్ధ మండల దీక్ష కావించారు. వీరు 21 రోజులు పాటు నిష్ఠగా శ్రీ అమ్మవారి దీక్షను పాటించవలసి ఉంది. ఈ నెల 9వ తేదీన 160 మంది భక్తులు 41 రోజుల మండల దీక్ష తీసుకొన్న విషయం ఇక్కడ గమనార్హం.
