సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 59 వ వార్షికోత్సవ సందర్భంగా గత గురువారం రాత్రి (జనవరి 26) రాత్రి ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి ఆమని కి సువర్ణ కంఠాభరణం తో శ్రీ అమ్మవారి జ్ఞాపికతో శాలువా కప్పి ఘన సన్మానం నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది భక్తులు, విశేషంగా మహిళలు హాజరు అయ్యారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు’ఆమనీ కి మేళ తాళాలతో శ్రీ అమ్మవారి దర్శనం చేయించి తదుపరి కళావేదిక పైకి తీసుకోని వెళ్లి ఘన సన్మానం నిర్వహించారు. మిస్టర్ పెళ్ళాం, మావిచిగురు, శుభమస్తు, శుభముహర్తం , జంబాలకిది పంబ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి, భీమవరం బుల్లోడా.. సాంగ్ తో ఒక ఊపు ఊపిన’ఆమనీ మాట్లాడుతూ.. ఎన్నో ఆలయాలు, వివిధ రాష్ట్రాల్లో అమ్మ వారి ఆలయాలు చూశా, అయితే శ్రీ మావుళ్లమ్మ వారి నిలువెత్తు మూలవిరాట్ ను చూసిన సమయం లో నాకు కలిగిన తృప్తి, ఆనందం ఎక్కడా కలగలేదు’ సుమారు పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో షూటింగ్ సమయం లో వచ్చి అమ్మ వారిని దర్శించుకుని వెళ్లానన్నారు. ఆనాడు తాను మొక్కుకున్న కోరిక ఇప్పుడు నేరవేరందని ఆనందం వ్యక్తం చేశారు. అమ్మ అందరినీ చల్లగా చూడాలని అంటూ అభివాదం చేశారు. ఈ సన్మాన సభలో తిరుమల దేవస్థానం మాజీ సభ్యు డు గోకరాజు రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెంటే పార్థసారథి, సినీ నిర్మా త తుమ్మలపల్లి రామసత్య నారాయణ, పండ్లవర్తక సం ఘం గౌరవాధ్యక్షుడు కాగిత వీరమహంకాళిరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామాయణం గోవిందరావు,కొప్పుల సత్తిబాబు ,వర్తక సంఘం అధ్య క్షుడు తుటారపు ఏడుకొండలు, ఆలయ సహాయ కమిషన్ యర్రంశెట్టి భద్రాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఛైర్మన్ మానేపల్లి .నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *