సిగ్మాతెలుగు డాట్, ఇన్‌న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ ఉత్సవాలు నెల రోజుల పాటుఘనం గా జరుగుతున్నాయి. సగం రోజులు అయిపోవడంతో ఇకపై రోజు రోజుకు భక్తుల సంఖ్యా భారీ స్థాయిలో పెరిగిపోతుంది. ఇక గత ఆదివారం సాయంత్రం నుండి రాత్రి 10 గంటలవరకు అయితే భీమవరం వన్ టౌన్ లో ఎక్కడ చుసిన అమ్మవారి ఉత్సవాలుని భారీ సెట్స్, తీర్ధం చూడటానికి దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సందడే.. సందడి.. హోటల్స్ రెస్టారెంట్స్, ఎగ్జిబిషన్ ఎక్కడ చుసిన సందడే.. సందడి.. ఇక అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల దేవాలయం నలువైపులా రోడ్డులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భారీ క్యూ లైన్ లలో భక్తులు ను ఈ సారి ఐడీబీఐ బ్యాంకు వైపు కాకుండా ఛాంబర్ వైపు నిలబెట్టడం తో కొంత సండే మార్కెట్ లో ట్రఫిక్ ఇబ్బంది తొలగింది. పోలీసులు చక్కగా పని చేసి వన్ టౌన్ లో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కానీ, ఉత్సవ భారీ పందిళ్ళ లో వేలాది జనం మధ్య ఎటువంటి త్రొక్కిసలాటలు లేకుండా చూసారు.అయితే ఒక మహిళా తన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకొని అందులో విలువైన డబ్బు ,క్రిడిట్ కార్డులు పొగొట్టుకొన్నట్లు నిర్వాహకులకు పిర్యాదు చేసింది.భక్తులు కూడా తమ పిల్లలను, వస్తువులను అప్రమత్తత తో గమనించవలసిన అవసరం ఉంది.
