సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61 వ వార్షిక మహోత్యవముల సందర్భంగా ధీ 11-12-2024 న నేటి బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ చే కళాపకర్షణ పూజ జంధ్యాల గంగాధర్ శర్మ తాళ్లపూడి వారు జరిపి గర్భ గుడి లోని శ్రీ అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల చేసారు. ఈలోగా భక్తులు దేవాలయంలో శ్రీ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకొనే అవకాశం ఉంది. శ్రీ అమ్మవారి మూలవిరాట్ స్వరూపాన్ని నూతన అలంకరణలతో తిరిగి ధీ 25-12-2024 ఉదయం 10.30 గంటలకు కళాన్యాసం జరిపి పునఃదర్శనం కొరకు ఆలయం తెరవబడునని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేసారు.
