సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో శ్రీ గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా వాడవాడలా గణేష్ పందిళ్ళలో అన్నసమారాధనలు తదుపరి నేటి మధ్యాహ్నం నుండి నిమజ్జనాల ఊరేగింపులు ఉపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహానికి వేడుకలు నిర్వహిస్తున్న పందిరిలో నవరాత్రులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా పూర్తీ చేసారు. నేటి బుధవారం దేవాలయ ధర్మ కర్తల మండలి సభ్యులతో కలసి చైర్మెన్ మానేపల్లి నాగన్న బాబు శ్రీ గణేష్ ప్రతిమకు కు ప్రత్యక పూజలు నిర్వహించిన తదుపరి ఉదయం 10-00 గంటల నుండి అన్నసమారాధన కార్యక్రమం ను ప్రారంభించి మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగించారు. వేలాది మంది భక్తులు స్వామివారి మహా ప్రసాదం స్వీకరించారు అని దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు. అనంతరం నేటి మధ్యాహ్నం స్వామివారి నిమజ్జనం కోసం ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు.
