సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయంలో నేడు, ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మచే చండీహోమం నిర్వహించినారు. 65 మంది దంపతులు ఈ హోమం లో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జస్టిస్ వి. గోపాలకృష్ణ రావు దంపతులు దర్శించుకున్నారు.వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు జరిపి వేద ఆశీర్వచనాలు నిర్వహించారు.
