సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్సవాలు జరుగుతున్నా నేపథ్యంలో నేడు, గురువారం మద్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రత్యేక పూజలు అనంతరం పుష్ప అలంకారం చేసిన వాహనంపై శ్రీ అమ్మవారి నగరోత్సవం ఘనంగా ప్రారంభయింది. స్థానిక నీరుల్లి కూరగాయ వర్తకసంఘం, ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ సహకారంతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. శ్రీ అమ్మవారి నగర ఊరేగింపులో బాణాసంచా కాల్పులు,తీన్మార్ వాయిద్యాలు, గరగల నృత్యాలు, కోలాటాలు ,శక్తి వేషాలు తో సందడి అంతాఇంతా కాదు. ఆలయ ఆవరణ లో నేటి సాయంత్రం నుండి లైటింగ్, పుష్ప అలంకరణలు, తెలుగు రాష్ట్రాల నుండి పేరుపొందిన వందలాది కళాకారులతో కళాప్రదర్శనలు ఏర్పాటు చేసారు. సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయ ఆవరణలో కళాకారులతో గొప్ప ప్రదర్శనలు.. బేతాళ నృత్యాలు, శక్తి వేషాలు, బుట్టబొమ్మలు, డప్పుల బృందాలు.. ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశేషంగా భక్తులు శ్రీ అమ్మవారి జేష్ఠమాస జాతరకు హాజరు అవుతున్నారు.
