సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస వేడుకలలో భాగంగా నేడు, గురువారం ఘనంగా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. నేటి మధ్యాహ్నం శ్రీ అమ్మవారి నగరోత్సవం హంస వాహనంపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభము అయ్యింది. శ్రీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యక పూజలు చేసారు. వాహనంపై పట్టణ ప్రధాన వీధుల గుండా శ్రీ అమ్మవారు ప్రజలకు అస్సిసులు అందజేస్తున్నారు. .భారీగా కళాకారులతో శక్తి వేషాలు, బుట్టబొమ్మలా కోలాహలం, తీన్మార్ వాయిద్యాలు, మేళతాళాలుతో, గరగల ఘట్టాలతో కళాకారుల నృత్యాలు బాణాసంచా కాల్పులతో , కోలాటం, నాటక ప్రదర్శనలు తో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ఆవరణంలో రాత్రి 10-30 గంటల వరకు జాతర ను భక్తుల సమక్షంలో ఆబాల గోపాలాన్ని అలరించడానికి ఘనంగా నిర్వహించడానికి నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు దేవస్థాన ధర్మకర్తల కమిటీ సహకారం తో ఏర్పాటు చేసారు.
