సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఉదయం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు జేష్ఠమాష జాతర ఆఖరి రోజు సందర్భంగా అమ్మవారి ఆలయములో పట్టణంలో ప్రజల ఇండ్లకు శ్రీ అమ్మవారి ప్రతిరూపంగా వెళ్లి వారి ని ఆసిర్వదించి తిరిగి వచ్చిన పవిత్ర గరగాలకు పుష్పాలతో అలంకరించిన ఉయ్యాల సేవ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జునశర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి అత్తింటి పుట్టింటి వారు మెంటే వారు,అల్లూరి వంశస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
