సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో ఈ నెల 26-09-2022 నుండి 05-10-2022 వరకు శ్రీ దేవినవరాత్రులు నిర్వహిస్తున్న నేపథ్యంలో .. శ్రీ అమ్మవారి ఆలయములో జరుగు కార్యక్రమములు తెలియజేయు ఆహ్వాన పత్రికలు, వాల్ పోస్టర్ లను స్థానిక శాసన సభ్యులు, గ్రంధి శ్రీనివాస్ చేతుల మీదగా నేడు, శనివారం విడుదల చేసారు. శ్రీ అమ్మవారి దసరా వేడుకలు ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చక్కటి ఏర్పట్లు చెయ్యాలని దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులను, ఈ ఓ ను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి యర్రంశెట్టి భద్రాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ, ముత్యాల వెంకట రామారావు, Ch నాగశేషగిరి, మావూరి సుందరరావు, తాళ్లపూడి భాగ్యలక్ష్మి , నీలాపు నాగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *