సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి అమ్మవారి ఆలయం ఆవరణలో శ్రీ అమ్మవారి దీక్షలు ధరించిన సుమారు 600 పైగా భక్తులచే సామూహికముగా కుంకుమా పూజ ను ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ నిర్వహించారు అలాగే శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ నందు శ్రీ అమ్మవారి దీక్ష ధరించి భక్తులచే ఆమెను తమ తమ ఇంటి ఆడపడుచుగా భావించి సామూహికముగా భారీ స్థాయిలో మిఠాయిలతో పాటు పసుపు కుంకుమ, గాజులు , చీరలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మరియు, ఇఓ , సహాయకమిషనర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *