సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం ఆవరణలో నేడు, శనివారం పౌర్ణమి సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణలతో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనం నిలుపుదల చేసినప్పటికీ భక్తులు విశేషంగా హాజరయి అమ్మవారి గర్భ గుడికి ప్రదక్షణలు చేస్తూ, శ్రీ అమ్మవారిని స్మరించుకొంటూ మ్రొక్కులు చెల్లించుకొంటున్నారు. ఆలయ ఆవరణలో ఉత్సవాలకు చలువ పందిళ్ళ ఏర్పాటు శరవేగంగా జరుగుతుంది.
